ఏపీ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు… మరో 73 మంది మృతి

Tuesday, September 8th, 2020, 09:30:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా నమోదు అవుతూ ప్రజలను ఆందోళన కి చెందేలా చేస్తున్న ఈ వైరస్, గడిచిన 24 గంటల్లో 10,601 మందికి సోకింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,17,094 కి చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో మరో 73 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొత్తం కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 4,560 కి చేరింది.

కరోనా వైరస్ మహమ్మారి ఒక పక్క విజృంభిస్తున్న ప్పటికి కూడా కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ భారిన పడి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11,691 కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,12,870 కి చేరింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 96,769 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.