బిగ్ న్యూస్: ఏపీ లో మళ్లీ పది వేలకు పైగా కరోనా కేసులు

Friday, August 28th, 2020, 08:15:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీని ప్రభావం ఎక్కువగా ఉండటం చేత రోజుకి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 10,526 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన కరోనా కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,00,721 కి చేరింది. అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 81 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మొత్తం ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 3,714 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,463 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 3,00,816 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 96,191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకూ సరైన వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ప్రజలు కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్త గా ఉండాలి అని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.