ఏపీ లో తగ్గని కరోనా ప్రభావం…మరో 74 మంది మృతి!

Wednesday, September 9th, 2020, 08:35:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రోజు పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో మరో 10,418 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 5,24,617 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి మరో 74 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మృతి చెందిన వారి సంఖ్య 4,634 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 9,842 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,22,712 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 97,271 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.