ఏపీ లో మళ్లీ పదివేలకు పైగా కరోనా కేసులు…మరో 72 మంది మృతి

Wednesday, September 2nd, 2020, 09:10:54 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 10,392 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సొకుతున్న వారి సంఖ్య రోజరోజుకీ పది వేలకు పైగా ఉండటం తో రాష్ట్ర ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,55,531 కి చేరింది.

అయితే అదే తరహా లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 72 మంది ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మృతి చెందిన వారి సంఖ్య 4,125 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8,454 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా సోకి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,48,330 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,03,076 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.