ఏపీ లో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు…నేడు ఎన్నంటే!?

Tuesday, September 1st, 2020, 08:56:29 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే భారి గా కేసులు నమోదు అవుతుండటం తో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 10,368 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కేసుల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,45,139 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 84 మంది ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మృతి చెందిన వారి తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 4,053 కి చేరింది. అయితే కరోనా వైరస్ మృతుల సంఖ్య నాలుగు వెలకి చేరడం తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 9,350 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,01,210 కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.