ఏపీ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Thursday, September 10th, 2020, 06:12:17 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా మరొకసారి పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను మరింత ఆందోళన కి గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 72,229 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 10,175 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,37,687 కి చేరింది.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 68 మంది ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య4,702 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 10,040 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,32,752 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 97,338 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.