కరోనా అప్డేట్: ఏపీ లో మళ్లీ 10 వేలకు పైగా కేసులు…మరో 77 మంది మృతి!

Wednesday, August 5th, 2020, 11:03:15 PM IST


కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలోనే ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. అయితే గడిచిన 24 గంటల్లో 60,576 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 10,128 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,86,461 కి చేరింది.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసుల పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. అదే విధంగా కరోనా వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,681 కి చేరింది.

అయితే ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,01,459 కి చేరింది. అయితే ప్రస్తుతం రాష్ట్రం లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 80,426. అయితే కరోనా వైరస్ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు, అధికారుల సూచిస్తున్నారు. ఈ కేసులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.