తెలంగాణలో మరో 101 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, February 8th, 2021, 09:41:58 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 18,252 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 101 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,95,682 కి చేరింది. నిన్న ఒక్క రోజే 197 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,92,229 కి చేరింది.

అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరోక వ్యక్తి కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మృతి తో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,611 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 1,842 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ మహమ్మారి కి కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో మృతుల సంఖ్య కూడా తగ్గుతోంది.