బిగ్ న్యూస్: ఏపీ లో మారని కరోనా పరిస్థతి…నేడు 85 మంది మృతి!

Monday, August 31st, 2020, 09:03:24 PM IST

Corona_india

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 56,490 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 10,004 కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,34,771 కి చేరింది. అదే తరహాలో గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి భారిన పడి 85 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,969 కి చేరింది.

అయితే ఏపీ లో ఈ మహమ్మారి ఇప్పుడు అప్పుడే తగ్గుముఖం పట్టేలా లేదు. అయితే గడిచిన 24 గంటల్లో 8,772 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 3,30,526 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,00,276 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.