నారా లోకేశ్‌పై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి అనిల్..!

Friday, October 30th, 2020, 07:30:09 PM IST

AP-Minister-Anil-Kumar

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ ఆరోపణలకు సమాధానం చెప్పడమే మా ఖర్మ అంటూ నీ లాగా, మీ బాబులాగా మీ తాత పార్టీ లాక్కొని జగన్ సీఎం కాలేదని అన్నారు. దేశంలోనే రైతుల సమస్యలు పరిష్కరించిన నేత జగన్ అని, లోకేష్‌ ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకోవాలని అన్నారు.

అయితే మీ పార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితులలో లేరని, పోలవరం పనులు 70 శాతం పూర్తయితే మీసాలు తీసేస్తానన్న నేత ఎక్కడ అని, మీసాలు లేని నేత మాట్లాడుతున్నారని అన్నారు. ఏ కమీషన్ల కోసం కేబినెట్ నోట్ పెట్టారో చెప్పండని నిలదీశారు. జగన్ పాదం వల్లే రెండేళ్లుగా డ్యామ్‌లు అన్నీ నిండుతున్నాయని, ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టో జగన్ క్యాబినేట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిని అయ్యానని అన్నారు. మీ తాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో నువ్వు ఓడిపోయావ్ అని ఎద్దేవా చేశారు.