పల్లెలు ప్రశాంతంగా ఉండటం బాబుకి ఇష్టం లేదు

Monday, February 1st, 2021, 01:52:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయం కో వ్యతిరేకత కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విపత్తు ఉండటం చేత, ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా వాయిదా వేయాలని న్యాయస్థానాలను కోరినా, తీర్పు మాత్రం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అనుకూలం గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ను చూసి రెచ్చిపోతున్నారు అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పంచాయతి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అడ్డదారులు తొక్కుతోంది అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయం గా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ వాళ్ళే అరాచకాలు చేస్తూ తమ పై నిందలు వేయడం సిగ్గుచేటు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూన్నాళ్లు ఉండే ఓ వ్యక్తి అండ చూసుకొని చంద్రబాబు నాయుడు రెచ్చిపోతున్నారు అని, పల్లెలు ప్రశాంతంగా ఉండటం చంద్రబాబు కి ఇష్టం లేదు అంటూ మంత్రి అన్నారు. అయితే ఎవరెన్ని డ్రామాలు చేసినా, పంచాయతీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా గెలుపు వైసీపీ దే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.