పోలవరం ముఖ్యమా? అమరావతి ముఖ్యమా? మంత్రి అనిల్ సూటి ప్రశ్న..!

Friday, December 4th, 2020, 04:44:47 PM IST

ఏపీ శాసనమండలిలో నేడు రాజధాని అమరావతిపై చర్చ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. అయితే అధికారపార్టీ సభ్యులు మాత్రం పోలవరంపై చర్చ జరపాలని కోరారు. ఈ నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ముందు అమరావతిపై చర్చ జరుగుతుందని, తర్వాత పోలవరంపై చర్చిద్దామని అన్నారు.

అయితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం ముఖ్యమా? అమరావతి ముఖ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపై చర్చించకుండా కేవలం 28 గ్రామాలకు సంబంధించిన అంశంపై చర్చించడం సరికాదని నిలదీశారు. అయితే పోలవరంపై నిన్ననే చర్చ పెడతామని అన్నారని ఇవాళ కూడా జరుగుతుందా లేదా అని ప్రశ్నించారు.