కరోనా వాక్సిన్ వికటించి అంగన్వాడి టీచర్ మృతి

Friday, February 19th, 2021, 05:31:51 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్ కి వాక్సిన్ వేయించుకున్న టీ.నారాయణమ్మ అనే అంగన్వాడీ టీచర్ గురువారం నాడు మృతి చెందారు. పులివెందుల లోని అహోబిలపురం లో ఉంటున్న నారాయణమ్మ రెండు వారాల క్రితం స్థానిక ఆసుపత్రి లో కరోనా వైరస్ కి వాక్సిన్ తీసుకున్నారు. అయితే వాక్సిన్ వేయించుకున్న రెండవ రోజన జ్వరం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం చేరారు. అయితే టైఫాయిడ్ అని తేలడం తో కడప రిమ్స్ కి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే అక్కడ కూడా జ్వరం తగ్గక పోవడం తో ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకు వచ్చిన గంటలోపే ఆమె ప్రాణాలను కోల్పోయారు. అయితే కుటుంబీకులు మాత్రం కరోనా వైరస్ వాక్సిన్ వికటించడంతో మృతి చెందినట్లు చెబుతున్నారు.