నవ నిర్మాణ దీక్షకు రంగం సిద్దం!

Tuesday, June 2nd, 2015, 09:00:49 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయవాడ కేంద్రంగా మరికాసేపట్లో నవ నిర్మాణ దీక్ష ప్రారంభంకానుంది. కాగా ఈ దీక్షను మొదలు పెట్టే ముందు నగరంలోని స్టెల్లా కాలేజి నుండి బెంజి సర్కిల్ దాకా బాబు నేతృత్వంలో భారీ ర్యాలీ జరగనుంది. అనంతరం దీక్షా వేదిక నుండి ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అటుపై మధ్యాహ్నం 3.30గంటల వరకు నవ నిర్మాణ దీక్ష కొనసాగుతుంది. అనంతరం చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టులోని నూతన టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. ఇక దీక్ష చేసేందుకు చంద్రబాబు ఇప్పటికే గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా అక్కడ తెలుగుదేశం మంత్రులు, నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.