బిగ్ న్యూస్: ఏపీ లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Monday, February 15th, 2021, 12:09:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి పదవ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. తాజా గా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం నాడు విడుదల చేయడం జరిగింది. 14 వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ను కొనసాగిస్తూ, గతంలో నిలిచిపోయిన ప్రక్రియ నుండే కొనసాగించే విధంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే మార్చి మూడవ తేదీన మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ కి గడువు ఇచ్చారు. అయితే విజయ నగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు,అనంతపురం, కడప ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.