ముగ్గురు భామలతో రవితేజ క్రేజీ ప్రాజెక్ట్!

Wednesday, November 11th, 2020, 03:51:47 PM IST

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ చిత్రం లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే, రవితేజ మరొక క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తున్నారు. అయితే నెక్స్ట్ చిత్రం ఖిలాడి ప్రాజెక్ట్ తో మంచి యాక్షన్ అండ్ ఎంట్టైన్మెంట్ అందించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయతీ కాగా, మరొక హీరోయిన్ గా అనసూయ భరద్వాజ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ కాస్త ఇప్పుడు ఫిలిమ్ నగర్ లో చెక్కర్లు కొడుతోంది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనసూయ భరద్వాజ్ అగ్రహరపు బ్రాహ్మణ యువతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరి కంటే కూడా అనసూయ పాత్ర కి ప్రత్యేకత ఎక్కువగా ఉందని ఇన్సైడ్ టాక్. అయితే రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.అయితే ఇందుకు సంబంధించిన అప్డేట్ రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.