అమ్మో.. అనసూయ రేంజ్ బాగా పెరిగిపోయింది..!

Wednesday, March 30th, 2016, 04:16:23 PM IST


టీవీ రంగం నుండి సినిమా రంగంవైపుగా అడుగులు వేసి సక్సెస్ అయిన నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనసూయ గురించి. మొదట మా టీవీలో వీజేగా కెరీర్ మొదలు పెట్టిన ఈమె మెల్లగా ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ గా చేసి బాగా పాపులర్ అయింది. ఆతరువాత పలు సినిమా ఆఫర్లు వచ్చిన కాదన్న ఈ భామ సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం వంటి సినిమాలను ఎంచుకుని మంచి పేరు తెచ్చుకుంది.

ఈమె నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టవడం వల్ల ఆమెకు క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. వివాహమై పిల్లలున్నప్పటికీ హుషారుగా సినిమాలో నటిస్తున్న ఈమె తాజాగా కోటి రూపాయల విలువైన ఆడి క్యూ7 కారును ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. చేసింది రెండు సినిమాలు అవీ సపోర్టివ్ రోల్సే అయినా అనసూయ రేంజ్ మాత్రం ఓ రేంజులో పెరిగిపోయింది.