ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం ప్రకటించలేదు – ఆనందయ్య

Thursday, June 10th, 2021, 09:43:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య కరోనా వైరస్ మందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు లభించినా, సహయ సహకారాలు అందడం లేదని ఆనందయ్య పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మందు తయారీ కొరకు యంత్ర సామాగ్రి కావాలంటూ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అని ఆనందయ్య పేర్కొన్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం ప్రకటించలేదు అని ఆనందయ్య వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించనీ పక్షం లో గురువారం నాడు సాయంత్రం ఆనందయ్య తన నిర్ణయం ను ప్రకటిస్తా అని అన్నారు.

అయితే నేడు ఇతర జిల్లాలకు మందు పంపిణీ విషయం పై తమ బృందం తో చర్చ జరపనున్నారు ఆనందయ్య. ఒక ట్రస్ట్ ద్వారా మందు పంపిణీ చేసే ఆలోచన చేస్తామని అన్నారు. అయితే ఇప్పటికే తమ గ్రామం లో కరోనా మందు పంపిణీ చేశామని తెలిపారు. అంతేకాక సర్వేపల్లి నియోజక వర్గం లో కూడా పంపిణీ జరుగుతుంది అని, 50 వేల మంది కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం అని ఆయన అన్నారు. మరి దీని పై నేడు రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందో లేదో చూడాలి.