టీడీపీలో మగవాళ్ళున్నారు గాని మగరాయుళ్ళు లేరంటూ రోజాకు ఝలకిచ్చిన ఆనం

Thursday, April 21st, 2016, 06:17:46 PM IST


ఆనం ఏపీ రాజకీయాల్లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్. ఏ అంశంపైనైనా ఎంతటి వారిమీదైనా సెటైర్లు వేస్తూ కామెడీగా స్పందించడం ఆయనకే చెల్లుతుంది. ఈయన చేసే కామెంట్లు వినేవారికి నవ్వు తెప్పిస్తాయిగాని పడేవారికి మాత్రం ఏడుపును తెప్పిస్తాయి. తాజాగా ఆయన కాంగ్రెస్ నుండి టీడీపీలోకి మారినప్పటి నుండి వైసీపీ ఫెయిర్ బ్రాండ్ రోజాపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

గతంలో రోజా అడుగుపెడితే జగన్ దెబ్బైపోతాడని చెప్పిన ఆనం తాజాగా టీడీపీలో మగవాళ్ళు లేక తమ పార్టీ నుండి తీసుకు వెళుతున్నారని ఘాటైన విమర్శలు చేసిన రోజా వ్యాఖ్యలకు స్పందిస్తూ వైసీపీలో మగవాళ్ళు ఉన్నారో లేదో తెలీదు గాని టీడీపీలో మాత్రం మగవాళ్ళు ఉన్నారని.. కానీ మగరాయుళ్ళు మాత్రం లేరని డైరెక్టుగా రోజాఫై సెటైర్లు విసిరారు. అలాగేజగన్ కు ప్రత్యేక ప్యాకేజీకి, ప్రత్యేక హోదాకు తేడా తెలీదని.. ఆయన వంటి వారు ప్రతిపక్షంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి: