హోం మంత్రి అమిత్ షా కి కరోనా నెగటివ్

Friday, August 14th, 2020, 11:01:23 PM IST


కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కొలుకున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా కరోనా నెగటివ్ వచ్చింది అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి నుండి కొలుకున్నపటికి వైద్యుల సూచన మేరకు మరి కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నారు అమిత్ షా. అయితే దేవుడు దయ తోనే కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నా అని, తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు అమిత్ షా.

అయితే గత కొద్ది రోజుల క్రితం ఆగస్ట్ 2 న కరోనా వైరస్ పాజిటివ్ రావడం తో గురుగ్రమ్ లోని ఒక ఆసుపత్రి లో చేరారు. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం కరోనా నెగటివ్ అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అపుడు ఆయనకు ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు అని కేంద్ర హోం శాఖ స్వయం గా తెలిపింది. నేడు కరోనా వైరస్ నెగటివ్ రావడం తో అమిత్ షా ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు.