ధైర్యంగా ఉండండి…జయం మనదే!

Wednesday, September 17th, 2014, 06:53:25 PM IST


భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉప ఎన్నికలలో పరాభావంపై కలత చెందవద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అలాగే మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలలో విజయం సాధిస్తామని ఆయన భరోశా ఇచ్చారు. అటుపై ‘కాంగ్రెస్ రహిత దేశం’ అజెండాతో ముందుకు వెళదామని అమిత్ షా పేర్కొన్నారు. ఇక కొన్ని చోట్ల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు ప్రతిపక్షాలు భాజపా ఓటమిని చూసి తగిన శాస్తి జరిగిందని ఆనందిస్తాయని అమిత్ షా తెలిపారు. కాని అస్సాం, పశ్చిమ బెంగాల్లో భాజపా ఖాతా తెరిచిందన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని అమిత్ షా గట్టిగా స్పందించారు.