రాహుల్ కు అమిత్ షా 8 ప్రశ్నలు

Tuesday, February 16th, 2016, 03:21:48 PM IST


ఢిల్లీలోని జేఎన్‌యూ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారి స్పందించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆయన గట్టి బదులే ఇచ్చారు. ఈ సందర్బంగా అమిత్ షా రాహుల్ గాంధీకి 8 ప్రశ్నలు సంధించి సమాధానాలు, క్షమాపణలు చెప్పమన్నారు. అందులో ‘ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నారు. వేర్పాటు వాదులతో చేతులు కలిపారా..? వాక్ స్వాతంత్ర్యం పేరుతో వేర్పాటువాదులకు మద్దతును తెలుపుతూ దేశాన్ని విడదీయాలని అనుకుంటున్నారా..? జాతి విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా..? జాతి విద్రోహ శక్తుల తరపున మాట్లాడుతూ వారికి మీరు సహకరించడం లేదా..?

1975లో ఇందిర ప్రబుత్వం విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య పాలనకు నిదర్శనం కాదా..? ఇందిరా గాంధీ స్వభావం హిట్లర్ స్వాభావమేనని రాహుల్ నమ్మడం లేదా..? అఫ్ఘల్ గురుకు సపోట్ చెయ్యడమే రాహుల్ వేర్పాటు వాదానికి నిదర్శనం కాదా..? సియాచిన్ లో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జావానులకు ఎందుకు రాహుల్ నివాళులర్పించలేదు..? అంటూ అమిత్ షా రాహుల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ చర్యలకు బదులుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.