అమిత్ షా ఎటువంటి తప్పూ చేయలేదట

Wednesday, January 20th, 2016, 06:00:49 PM IST


బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షా పై 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ముజఫర్ జిల్లా ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈయనపై ఉత్తర ప్రదేశ్ లోని కాక్రోలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.

అయితే కోర్టులో పలుసార్లు జరిగిన విచారణ అనంతరం ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఈరోజు బుధవారం కోర్టుకు తుది నివేదిక సమర్పించారు. దీంతో అమిత్ షా పై ఉన్న కేసు దాదాపు ముగిసినట్టే. ఇక మిగిలింది మేజిస్ట్రేట్ తుది నిర్ణయం మాత్రమే. 2014 లో ఏప్రిల్ లో బర్వార్ గ్రామంలో అమిత్ షా ప్రచారంలో మాట్లాడుతూ ములాయం సింగ్ ప్రభుత్వం పై, ముస్లిం ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చినట్టు పోలీసులు అప్పటి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.