హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీ దే అని నమ్ముతున్నా – అమిత్ షా

Sunday, November 29th, 2020, 09:08:30 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యర్థుల పై ఘాటు విమర్శలు చేస్తూనే, ఆయా పార్టీలు తమ హామీల గురించి ప్రస్తావిస్తున్నాయి. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కి అవకాశం ఇస్తే సుపరిపాలన అందిస్తాం అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఐటీ పరంగా మరింత అభివృద్ధి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

అయితే దారి పొడవునా అంగుళం ఖాళీ లేకుండా తనకు స్వాగతం పలికిన హైదరాబాద్ నగర వాసులకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ రోడ్ షో లో ప్రజా ఆదరణ చూసిన తరువాత హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీ దే అని నమ్ముతున్నా అంటూ అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.హైదరాబాద్ నగర అభివృద్ది కోసం కేంద్రం అనేక నిధులను ఇస్తుంది అని అమిత్ షా అన్నారు. అంతేకాక ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భారీ వరదలు ముంచెత్తాయి. అయితే వరదలకు నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని అమిత్ షా అన్నారు. అయితే నగరం లోని నాలాల పై, చెరువుల పై అక్రమ కట్టడాలు ఉన్నాయి అని, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కి ఒక్క అవకాశం ఇవ్వాలి అని, వాటిని కూల్చివేస్తామని అన్నారు. అంతేకాక తాము వాగ్దానం చేశామంటే కచ్చితంగా అమలు చేస్తాం అంటూ అమిత్ షా మరొకసారి అన్నారు.

అయితే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో బీజేపీ నేతల పై, అటు కాంగ్రెస్, తెరాస, ఎం ఐ ఎం లు ఘాటు విమర్శలు చేయగా, అమిత్ షా చేసిన తాజా వ్యాఖ్యల తో ఎవరెలా స్పందిస్తారు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.