అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్..!

Friday, October 2nd, 2020, 01:17:58 PM IST

అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. ట్రంప్ సలహాదారుల్లో ఒకరైన హోప్ హిక్స్‌కు కరోనా సోకడంతో ట్రంప్ దంపతులు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ట్రంప్ దంపతులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపధ్యంలో ట్రంప్ కరోనా బారిన పడడం ఆయన విజయావకాశాలపై ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు త్వరగా కోలుకోవాలని మన దేశ ప్రధాని మోదీ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.