ఇది తెలంగాణ కాదు, జగన్ పాలిస్తున్న ఏపీ.. అంబటి కీలక వ్యాఖ్యలు..!

Thursday, January 7th, 2021, 02:18:49 AM IST

Ambati_Rambabu
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని, బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో కూడా రిపీట్ అవుతాయని, తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం దేశమంతా ఎదురు చూస్తుందని బండి సంజయ్ మాట్లాడిన సంగతి తెలిసిందే.

అయితే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ అంబటి రాంబాబు బండి ఒక కార్పోరేటర్ స్థాయి నాయకుడన్నది మరిచిపోయి మాట్లాడుతున్నాడని అన్నారు. ఇది తెలంగాణ కాదు.. సీఎం జగన్ పాలిస్తున్న ఏపీ అని చురకలంటించారు. ఇకనైనా బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలని, అనవసరమైన మాటలతో ఏపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం సరికాదని అంబటి సూచించారు.