ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!

Monday, August 31st, 2020, 01:37:28 PM IST

ambati rambabu

వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ ఆధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీపై మరోసారి మండిపడ్డారు. ఏపీ ప్రజలకు ప్రతిపక్షం దూరమయ్యిందని చంద్రబాబు కేవలం జూమ్ బాబు అయ్యారని, హైదరాబాద్ నుంచి ఆయన కదలరని అన్నారు. లోకేశ్ బాబు ట్విట్టర్‌ను వదిలి రావడం లేదని అన్నారు. చంద్రబాబు తనకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ప్రతిపక్షం ఉందని భ్రమింపచేస్తున్నారని అసలు ఏపీలో ప్రతిపక్షమే లేదని అన్నారు.

అయితే 60 వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాల ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందచేసిందని, దళితులకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు. అంతేకాదు తనపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై కూడా స్పందిస్తూ దీనిపై నేను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపినా, సీబీఐ విచారణ జరిపినా నేను సిద్దమేనని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.