టీడీపీ అంతరించిపోతున్న పార్టీ.. అంబటి సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, March 31st, 2021, 02:36:14 AM IST

Ambati_Rambabu
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ అంతరించిపోతున్న రాజకీయా పార్టీ అని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం, చంద్రబాబు మరో సారి సీఎం అవ్వడం ఇక కలగానే మిగిలిపోతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంతర్ధాన దినోత్సవంలా చేశారని ఎద్దేవా చేశారు.

అయితే ఎన్టీఆర్ కుమారులకు నిజంగా పౌరుషం ఉంటే టీడీపీని కాపాడుకునే వారని అంబటి అన్నారు. అయితే భవిష్యత్తులో టీడీపీ ఆఫీసులను హెరిటేజ్ మాల్స్ గా మార్చుకోవాల్సిందే తప్పా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు చేసేదేమి లేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ శిథిలావస్థకు చేరుకుందని ఇకనైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలని అన్నారు.