మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారు – అంబటి రాంబాబు

Tuesday, March 2nd, 2021, 02:25:39 AM IST

Ambati_rambabu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమిని అంగీకరించలేని నాయకుడు చంద్రబాబు అని అందుకే ఓటమిని ఎవరో ఒకరిపై నెట్టి డ్రామాలు ఆడడం ఆయనకు అలవాటేనని అన్నారు. అందుకే నేడు రేణిగుంటలో డ్రామాకి తెరలేపారని అనారు. అయితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశాను, ప్రతిపక్ష నాయకుడినని చెప్పుకునే వ్యక్తికి ఎన్నికల కోడ్, కరోనా పరిస్థితుల్లో నిరసన చేయకూడదని తెలియదా అని ప్రశ్నించారు.

అంతేకాదు చంద్రబాబుకు నిన్న రాత్రే నిరసనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారని అయినా పట్టించుకోకుండా వచ్చి పోలీసులపై దౌర్జన్యంగా మాట్లాడారని ఆరోపించారు. నిరసనలు చేయాలంటే ఎస్ఈసీ దగ్గర, కోర్టుల దగ్గర అనుమతి తీసుకుని చేయాలని రాజ్యాంగానికి ఎంతటివారైనా మినహాయింపు కాదని అది చంద్రబాబు గుర్తించుకోవాలని సూచించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనటానికి వైజాగ్ వెళ్లినప్పుడు అడ్డుకోవడం అప్రజాస్వామికం కాదా అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబును చూసి వైసీపీ భయపడుతుందని కొందరు మాట్లాడుతున్నారని అసలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం టీడీపీకి అభ్యర్థులు కూడా లేరని, చిత్తుగా ఓడిన చంద్రబాబును చూసి మేము భయపడతామా అని ఎద్దేవా చేశారు.