అన్నయ్య వస్తాడని ఎదురుచూసి మోసపోకు.. పవన్‌కు అంబటి రాంబాబు కౌంటర్..!

Saturday, January 30th, 2021, 05:28:07 PM IST

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఇటీవల పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను ఉంటానని చిరంజీవి మాటిచ్చారని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమికి మెగస్టార్ చిరంజీవి మద్దతు ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా చెప్పడంతో చిరంజీవి జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం ఖాయంగా అనిపిస్తుంది.

అయితే చిరంజీవి రీఎంట్రీపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. అన్నయ్య వస్తాడని ఎదురుచూసి మోసపోకుమా.. ఉన్న తమ్ముళ్లతో సర్దుకొని సాగిపో సుమా ఇండైరెక్ట్ గా కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే నిన్న మంగళగిరిలో కాపు సంక్షేమ సేన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ప్రజారాజ్యం వ్యవస్థాపకుల్లో చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. జనసేన పార్టీలో చిరంజీవి చేరతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని, పరిస్థితులను బట్టి ఆయన చేరిక ఉంటుందని అయితే పార్టీలో చేరడం, చేరకపోవడం చిరంజీవి అభిప్రాయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.