అమెజాన్ సీఈఓ పదవి నుండి తప్పుకొనున్న జెఫ్ బెజోస్

Wednesday, February 3rd, 2021, 09:04:49 AM IST

ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ, ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణధికారి ప్రపంచ కుబేరుడు గా పేరు ఉన్న జెఫ్ బెజొస్ తాజాగా సంచలన ప్రకటన చేశారు.తన సీఈఓ పదవి నుండి తప్పుకోనన్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది చివరి వరకు అమెజాన్ లో అన్ని రకాల బాధ్యతల నుండి తొలగునున్నట్లు తన వారసుడు ను సైతం ఫిక్స్ చేశారు.అయితే అమెజాన్ వెబ్ సర్వీసేస్ హెడ్ అయిన ఆండి జాక్సి ను సీఈఓ గా నియమించనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.