ఆకాశం నుంచి రామ సేతు .. వావ్.. అద్బుతం..!

Tuesday, January 5th, 2016, 08:45:04 AM IST

ఆకాశం నుంచి భూభాగాన్ని చూస్తే మనకు ఎలా కనిపిస్తుంది అనే విషయం గురించి అందరికీ ఉత్కంఠమ్ గా ఉంటుంది. ఆకాశం నుంచి చూస్తే మనకు చైనా వాల్ ఒక్కటే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, నాసా శాస్త్రవేత్త, ఆస్ట్రోనాట్ స్కాట్ కెల్లీ అంతరిక్ష కేంద్రం నుంచి దక్షిణ భారత దేశానికి చెందిన కొన్ని అద్బుతమైన ఫోటోలను తీసి భూమిపైకి పంపాడు. తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంకను కలిపే రామసేతు బ్రిడ్జ్ ఈ ఫోటోలో అందంగా అద్బుతంగా కనిపిస్తున్నది. ఇయర్ ఇన్ స్పేస్ సీరిస్ లో భాగంగా ఎర్త్ ఆర్ట్ పేరుతో ఈ అందమైన.. అద్బుతమైన ఫోటోలను తీశాడు. కాగా, ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. స్పేస్ స్టేషన్ కమాండర్ గా ఉన్న స్కాట్ మార్చి 2016 వరకు స్పేస్ స్టేషన్ లోనే ఉంటారు.