వైసీపీ మంత్రులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు – అమరనాథ్ రెడ్డి

Wednesday, October 7th, 2020, 02:20:44 PM IST

వైసీపీ మంత్రులపై టీడీపీ మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ మంత్రులు తమస్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని వారిని చూస్తేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైసీపీ మంత్రులంతా అవినీతిలో మునిగితేలుతున్నారని, మంత్రి గుమ్మనూరు జయరాం బెంజ్ కారు విషయంలో ఇప్పటికీ సరైన సమాధానం లేదన్నారు.

అంతేకాదు మంత్రి గుమ్మనూరు జయరాం 400 ఎకరాలకు పైగా భూ దోపిడీకి పాల్పడిన విషయాన్ని కూడా టీడీపీ ఆధారాలతో సహా వెల్లడించిందని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడి, అక్రమ కేసులు పెట్టి పోలీసులతో కొట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నించినా, తప్పులను ఎత్తి చూపినా వాళ్ళ ఇళ్ళను కూల్చే పనిలో పడ్డారని ఆరోపించారు. అయితే వైసీపీ నేతలు జైలుకు వెళ్ళారని అందుకే అందరిని జైలుకు పంపాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.