లైవ్ డిబేట్‌లోనే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి..!

Wednesday, February 24th, 2021, 02:49:12 AM IST


రాజకీయ నేతలు ఏదో ఒక విషయంలో ఒకరికొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం సర్వ సాధారణం. కానీ లైవ్ డిబేట్‌లలో కోట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయితే తాజాగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితికి చెందిన శ్రీనివాస్ చెప్పుతో కొట్టడం సంచలనంగా మారింది.

ఏపీ రాజధాని అమరావతి అంశంపై మాట్లాడుతున్న సమయంలో ఏదో మాట మాట పెరిగి టీడీపీ ఆఫీసులో పని చేసుకో, టీడీపీ జెండా పట్టుకో.. పెయిడ్ ఆర్టిస్ట్ అని శ్రీనివాసరావును విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశాడు. దీంతో కోపంతో జేఏసీ నేత శ్రీనివాసరావు తన కాలికున్న చెప్పును తీసి విష్ణువర్ధన్ పై దాడి చేశారు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొనడంతో చర్చ నుంచి శ్రీనివాసరావును బహిష్కరించారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.