రియల్ హీరో కు గ్రాండ్ వెల్కమ్ పలికిన ‘అల్లుడు అదుర్స్’ టీమ్

Monday, September 28th, 2020, 06:50:45 PM IST

కరోనా వైరస్ మహమ్మారి విపత్తు ఇంకా తగ్గలేదు. అయితే కష్ట కాలం లో తనకు తోచిన సహాయం చేసి, ప్రజల గుండెల్లో దేవుడి లా, ఒక హీరో లా నిలిచాడు సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రలో పోషిస్తూ ఉండే సోనూ సూద్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ లో పలువురు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే హైదరాబాద్ కి చేరుకున్న సోను సూద్. తాజాగా అల్లుడు అదుర్స్ చిత్ర షూటింగ్ లో తిరిగి పాల్గొనేందుకు సిద్దం అయ్యారు.

అయితే సెట్స్ వద్దకు చేరుకున్న సోనూ సూద్ కి చిత్ర యూనిట్ గ్రాండ్ వెల్కమ్ పలికింది. నటుడు ప్రకాష్ రాజ్ సోనూ సూద్ కి శాలువా కప్పి సత్కరించారు. అంతేకాక ఒక జ్ఞాపిక ను కూడా అందజేశారు. అయితే సోనూ సూద్ రాకతో, చిత్ర షూటింగ్ పునః ప్రారంభం తో వారిలో సంతోష వాతావరణం నెలకొంది. చిత్ర యూనిట్ అంతా కూడా సోనూ సూద్ ను అభినందించారు. అల్లుడు అదుర్స్ చిత్రం లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అను మరియు నబ్బ నటేశ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.