ఆగస్ట్ 13 కి థియేటర్ల లో పుష్ప… కన్ఫర్మ్ చేసిన బన్నీ!

Thursday, January 28th, 2021, 11:09:57 AM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఈ చిత్రం తో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా అవతారం ఎత్తనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను అల్లు అర్జున్ ప్రేక్షకులతో సోషల్ మీడియా వేదిక గా పంచుకున్నారు. ఆగస్ట్ 13, 2021 నుండి పుష్ప దియేటర్ల లోకి వస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కూడా మళ్ళీ థియేటర్ల లో కలవడం ఎంతో ఎక్జైటింగ్ గా ఉంది అంటూ పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ సుకుమార్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లతో మూడోసారి చేస్తుండటం తో, ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఆశిస్తున్నా అంటూ బన్నీ చెప్పుకొచ్చారు.

సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సార్లు నటించిన బన్నీ, పుష్ప తో పాన్ ఇండియా హీరో గా మారనున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మరొకసారి తన సంగీతం తో మ్యాజిక్ చేయనున్నాడు. అటు అలా వైకుంఠ పురం లో చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడం, రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.