అల్లు అర్జున్ ఖాతాలో మరొక సాలిడ్ రికార్డ్..!

Tuesday, November 24th, 2020, 05:12:29 PM IST

అలా వైకుంఠ పురం లో చిత్రం అల్లు అర్జున్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ చిత్రం ఇప్పటి వరకు ఎన్నో రికార్డ్ లని నెలకొల్పింది. ఈ చిత్రం లోని పాటలు అయితే ఈ ఏడాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేవలం తెలుగు భాషా ప్రేమికులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా బుట్ట బొమ్మ, రాములో రాములా, సామజవరగమన పాటలు చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు బుట్ట బొమ్మ పాట మరొక సాలిడ్ రికార్డ్ ను నమోదు చేసుకుంది.

అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. ఈ చిత్రం లోని బుట్ట బొమ్మ పాట 450 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం తో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పక్క పూజ హెగ్డే అభిమానులు సోషల్ మీడియా లో ఈ సాంగ్ పేరిట ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రం లో నటిస్తూ బిజీగా ఉండగా, పూజ హెగ్డే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో రాధే శ్యామ్ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ రికార్డ్ సాధించడం పట్ల అభినందనలు తెలిపారు.