అల్లు అర్జున్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయనున్న బాలీవుడ్

Friday, November 20th, 2020, 03:23:31 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి చిత్రం టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో టోనీ డిసౌజా రూపొందిస్తుండగా, బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవటి తనయుడు నమశి చక్రవర్తి హీరో గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభం కానుంది. అయితే ఇదే హీరో మరొక అల్లు అర్జున్ చిత్ర రీమేక్ లో నటిస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసు గుర్రం చిత్రం లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం అల్లు అర్జున్ స్థాయిని మరొక మెట్టు ఎక్కించిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఈ చిత్రం రీమేక్ అవుతున్నా సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో కూడా నమషి చక్రవర్టి హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లో కూడా హైదరాబాద్ కి చెందిన నటి అమ్రిన్ ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే అలా వైకుంఠ పురం లో చిత్రం ను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు పలువురు సన్నాహాలు చేస్తున్నారు.