అభిమానులకు మరింత దగ్గరగా .. అల్లు అర్జున్ ?

Sunday, November 19th, 2017, 09:45:43 PM IST

అల్లు అర్జున్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ .. అయన సోషల్ మీడియా అకౌంట్ చూస్తే తెలుస్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ? ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తన ఫాన్స్ కు దగ్గరగా ఉన్న బన్నీ .. ఇప్పుడు వారికీ మరింత దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు, మరో రెండు రోజుల్లో అయన ఈ అకౌంట్ ద్వారా ప్రేక్షకుల్లోకి రానున్నాడు. బన్నీ తన జ్ఞాపకాలను ఈ సోషల్ మీడియా లో పదిలపరుచుకోవడమే కాకుండా ఫాన్స్ తో ఉన్న మధురానుభూతులను కూడా అందులో పంచుకోనున్నాడట. మొత్తానికి అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడంతో ఫాన్స్ తెగ ఖుషి పడుతున్నారు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న నాపేరు సూర్య సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.