కళ్యాణ్ గారికి ఖుషీ ఆల్ టైమ్ రికార్డ్ – బన్నీ

Tuesday, January 12th, 2021, 02:22:58 PM IST

అలా వైకుంఠ పురం లో చిత్రం విడుదల అయి ఏడాది పూర్తి అయింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా భారీ విజయం సాధించడం మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకోవడం తో టీమ్ అంతా కూడా రీ యూనియన్ అయింది. ఈ మేరకు అల్లు అర్జున్ వేడుక లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతేడాది సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరికీ కూడా బ్యాడ్ ఇయర్ గా నదిచింది అని, తనకు మాత్రం అలా కాదు అని, అలా చెప్పలేను అంటూ ఎమోషనల్ అయ్యారు బన్నీ. సినిమా విడుదల అయి ఏడాది అయినా ఏదో ఒక. విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని, సినిమా ను సంక్రాంతి కి కాక, సమ్మర్ కి విడుదల చేసి ఉంటే ఇంత భారీ విజయం దక్కించుకొని ఉండేది కాదు అని తెలిపారు. కోవిద్ కి ముందు ఏడాదిన్నర ఇంట్లోనే కూర్చున్నా అని, ఆ తర్వాత కూడా అలానే అయింది అని, అలా వైకుంఠ పురం లో విజయం ఎంతగానో ఎనర్జీ ను ఇచ్చింది అంటూ బన్నీ చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భం లో ఒక విషయం పంచుకోవాలి అని అంటూ బన్నీ ఇలా అన్నారు.

ప్రతి నటుడు కి ఏదో ఒక సమయం లో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది అని, జర్నీలో అదొక బ్యూటిఫుల్ మైల్ స్టోన్ అవుతుంది అని అన్నారు. అయితే కళ్యాణ్ గారికి ఖుషీ ఆల్ టైమ్ రికార్డ్ అని అన్నారు. అది ఆయన ఏడో సినిమా అని అన్నారు. అలానే జూనియర్ ఎన్టీఆర్ కి సింహాద్రి ఏడో సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అంటూ తెలిపారు. అలానే రామ్ చరణ్ కి రెండవ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే నాకెప్పుడూ పడుతుంది సినిమా అని అనుకొనే వాడిని అని, అందరికీ చాలా ముందుగా పడింది అని, తనకు మాత్రం 20 సినిమాలు పట్టింది అని అన్నారు. అయితే ఇది తనకి మొదటి అడుగు అని, ఇక పై తను ఏంటో చూపిస్తా అంటూ భావోద్వేగం అయ్యారు. అంతేకాక థమన్ కి డబుల్ థాంక్స్ తెలిపారు. వన్ బిలియన్ ఆల్బమ్ అడిగితే టు బిలియన్ ఆల్బమ్ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చారు.