జాతి రత్నాలు చిత్రం పై అల్లు అర్జున్ ప్రశంశల వర్షం!

Friday, March 12th, 2021, 01:09:27 PM IST

ఇటీవల కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా, కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకు మరొక ఉదాహరణ గా జాతి రత్నాలు అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రం విడుదల అయిన అన్ని థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. అయితే ఈ చిత్రాన్ని చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

జాతి రత్నాలు చిత్రాన్ని లాస్ట్ నైట్ చూసాను, చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. హిలేరియస్ గా ఉందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇంతగా ఎప్పుడు నవ్వలేదు అని చెప్పుకొచ్చారు. హీరో నవీన్ పోలిశెట్టి తన నటన తో ఆకట్టుకున్నారు అని అన్నారు. కొత్త తరం నటుల్లో స్టన్నింగ్ పెర్ఫార్మార్ అంటూ చెప్పుకొచ్చారు. రాహుల్ పై సైతం ప్రశంసల వర్షం కురిపించారు. బ్రిలియంట్ గా ఎఫర్ట్ లేకుండా చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రియదర్శి, హీరోయిన్ ఫరియ అబ్దుల్లా నటన అద్భుతం అని అన్నారు. ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషయన్లకి మ్యూజిక్ డైరెక్టర్ రదన్ కి అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్, స్వప్న ప్రియాంక ల తో పాటుగా దర్శకుడు పట్ల ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ చేసిన పోస్ట్ పట్ల చిత్ర యూనిట్ కృతజ్ఞతలు చెబుతూ స్పందిస్తున్నారు.