అల్లరోడికి పెళ్లి కుదిరింది!

Thursday, April 30th, 2015, 05:23:22 PM IST


ప్రముఖ టాలీవుడ్ హాస్య కధానాయకుడు అల్లరి నరేష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఇక ప్రముఖ హాస్యనటుడు రాజేద్రప్రసాద్, ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారి హీరో సీనియర్ నరేష్ ల తర్వాత కామెడీలో అంతటి క్రేజును సంపాదించుకున్న నటుడు నరేష్ అనే చెప్పుకోవచ్చు. ఇక ‘అల్లరి’ సినిమా ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ హీరో ఆ పేరునే ఇంటిపేరు చేసుకుని అల్లరి నరేష్ గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

కాగా తన హాస్య చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఈ నవ్వుల హీరోకు ఇప్పుడు పెళ్లికళ వచ్చింది. ఇక కృష్ణా జిల్లాకు చెందిన విరూప అనే యువతితో అల్లరోడి పెళ్లి కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మే 3వ తేదీన అల్లరి నరేష్, విరూపల నిశ్చితార్ధం కూడా జరగనున్నట్లు సమాచారం. కాగా అల్లరి నరేష్ ప్రముఖ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడన్న సంగతి తెలిసిందే.