టీడీపీ కార్యాలయం కూల్చేందుకు ఆదేశించండి.. సుప్రీం కోర్ట్‌లో పిటీషన్..!

Friday, August 28th, 2020, 08:15:40 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చివేయడానికి ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయం నిర్మించారని, ఆ భూ కేటాయింపును రద్దు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా గతంలో దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో కూడా పిటీషన్ దాఖలు చేశారు. నాలుగు ఎకరాలున్న ఈ భూమిని 2017లో అప్పటి ప్రభుత్వం టీడీపీకి తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజుకిస్తూ జీవో జారీ చేసిందని పర్యావరణ చట్టాల ప్రకారం వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు కేటాయించడం చట్ట విరుద్ధమని ఆళ్ల కోర్టుకు తెలిపినా హైకోర్ట్ మాత్రం దీనిపై ఇంతకుముందే రిట్ పిటిషన్ దాఖలయ్యిందని చెబుతూ ఆళ్ల పిటీషన్‌ను కొట్టిపారేసింది.