చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆళ్ళ నాని

Monday, September 21st, 2020, 10:56:15 PM IST

Alla-Nani

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ఆరోగ్య శాఖ ను నిర్లక్ష్యం చేసింది అని, ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు అని ఆళ్ళ నాని అన్నారు. అయితే విజయ నగరం జిల్లాలో 186 కోట్ల రూపాయలతో ఆసుపత్రులను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి ను విజయవంతంగా ఎదుర్కొన్నాం అని తెలిపారు.

మొత్తం భారత దేశంలోనే కరోనా వైరస్ ను ఎదుర్కోవడం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముందు ఉంది అని పేర్కొన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు 16 వేల కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగింది అని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు 16 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటుగా 16 మెడికల్ కాలేజ్ లను మంజూరు చేసినట్లు వివరించారు.