కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవం – ఆళ్ళ నాని!

Tuesday, August 4th, 2020, 08:23:38 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి బాగోలేక పోయినా, కరోనా పేషంట్ కి పౌష్టిక ఆహారం కొరకు రోజుకి 500 రూపాయలు కర్చు చేస్తున్నట్లు మీడియా సమావేశం లో తెలిపారు. అయితే కర్నూల్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవం అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు.

అయితే గతం లో మాదిరి కాకుండా ఇపుడు టెస్టుల సామర్ధ్యం పెంచినట్లు తెలిపారు. అంతేకాక అన్ లాక్ ప్రక్రియ మొదలు కావడం తో టెస్టుల సంఖ్య పెంచాం అని, అందువల్ల పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని వివరించారు.ప్రస్తుతం కర్నూల్ లో 3880 బెడ్ లను అందుబాటులో ఉన్నాయి అని, వీటిని పెంచే అవకాశం ఉందని తెలిపారు. వైద్య సిబ్బందిను సైతం పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆహారం విషయం లో రాజీ పడేది లేదు అని, ఎవరైనా నిర్లక్షం వహిస్తే కాంట్రాక్టర్ ల పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం జగన్ ఒక పక్క కరోనా వైరస్ కట్టడికి ఎంతో కష్టపడుతుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.