కరోనా నివారణ అంశం పై ఆళ్ళ నాని కీలక వ్యాఖ్యలు

Thursday, November 19th, 2020, 01:30:45 PM IST

కరోనా వైరస్ మహమ్మారి నివారణకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని వివరించారు. చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోసం 10.20 కోట్ల రూపాయల తో భవనాల నిర్మాణం చేపట్టిన విషయాన్ని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 12 వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల అభివృద్ధి కి 94.88 కోట్ల రూపాయల ను ప్రభుత్వం మంజూరు చేసింది అని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మౌలిక సదుపాయాల తో పాటుగా నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచమని తెలిపారు.

రాష్ట్రం లో కరోనా వైరస్ నివారణ లో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజ లో ఉందని ఆళ్ళ నాని వివరించారు. రాష్ట్రంలో కొవిద్ పరీక్షల రేటును అన్ని ప్రైవేట్ క్యాన్సర్ ఆసుపత్రుల్లో 1600 రూపాయల నుండి 800 రూపాయలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. వైద్య నిమిత్తం జిల్లాలో బెడ్స్ మరియు పైప్ లైన్ల కోసం 3.10 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది అని అన్నారు.