రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరం..!

Wednesday, September 16th, 2020, 01:30:25 PM IST

Rajasthan_royals

కరోనా కారణంగా ఇప్పటికే ఆలస్యమైన ఈ ఏడాది ఐపీఎల్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే కొన్ని జట్లలో కీలక ఆటగాళ్లు దూరం కాగా తాజాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే గత ఏడాది ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచ కప్ అందించడంలో బెన్ స్టోక్స్ కీలకపాత్ర పోశించాడు. అయితే ప్రస్తుతం బెన్ స్టోక్స్ తండ్రి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అందుకే స్టోక్స్ ఈ సీజన్‌లో ఆడటం అనుమానమేనని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. అయితే ప్రస్తుతం మేము స్టోక్స్‌ కుటుంబం గురుంచి ఆలోచిస్తున్నామని అందుకే ఈ ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండే అంశం అతడికే వదిలేసినట్టు కోచ్ తెలిపాడు. అయితే స్టోక్స్‌కి కావలసినంత సమయమ ఇచ్చామని ఆయన ఆడేది లేనిది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు.