సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై పై గెలిచేనా?

Tuesday, November 3rd, 2020, 04:22:08 PM IST

ఈ ఏడాది ఐపియల్ సీజన్ చాలా రసవత్తరం గా సాగుతుంది. ఈ ఐపియల్ లీగ్ దశలో చివరి మ్యాచ్ కి రంగం సిద్దం అయింది. నేడు ముంబై ఇండియన్స్ కి మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ కు మద్యలో సిసలైన పోరు జరగనుంది. ప్లే ఆఫ్ కి చేరాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తప్పక గెలవాల్సి ఉండగా, ముంబై ఇండియన్స్ సైతం గెలుపు తో లీగ్ దశను ముగించెందుకు సిద్దం అయింది.

అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే కోలకతా నైట్ రైడర్స్ ఐపియల్ నుండి నిష్క్రమించాల్సి ఉండగా, ఎలాంటి ఫలితం వస్తుంది అన్న దానిపై అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. గత రెండు మ్యాచ్ లలో హైదరాబాద్ సమిష్టి గా రాణించింది. ఓపెనర గా వృద్దిమాన్ సహా సైతం అద్బుతం గా రాణిస్తుడండటం టీమ్ కి బాగా ప్లస్ అని చెప్పాలి. అయితే 2016 లో కూడా హైదరాబాద్ ఇలాంటి పరిస్థిటి ఎదుర్కొంది. నాడు చివరు మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ కి చేరుకోవడం జరిగింది.