దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్దం.. రేపే పోలింగ్..!

Monday, November 2nd, 2020, 11:13:15 PM IST

తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ రేపే జరగబోతుంది. ఈ నేపధ్యంలో పోలింగ్‌కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. అంతేకాదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌‌‌‌ జరుగనుంది.

అయితే దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉండగా అందులో 98,028 మంది పురుష ఓటర్లు, 10,0719 మహిళా ఓటర్లు ఉన్నారు. ఇదిలాఉంటే నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 89 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అక్కడ మరింత బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా కరోనా బాధితులు ఓటేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించారు.