“ఆర్ఆర్ఆర్” సెట్స్ లోకి అడుగుపెట్టిన అలియా భట్

Monday, December 7th, 2020, 01:57:29 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ పూర్తి కాగా, మిగతా సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ సెట్స్ లోకి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అడుగుపెట్టిన విషయాన్ని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. సీత పాత్ర పోషిస్తున్న అలియా సెట్స్ లోకి అడుగుపెట్టడం తో రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ చెప్తూ ఒక పోస్ట్ చేశారు రాజమౌళి.

అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ కథానాయిక గా నటిస్తున్నారు. సంగీతం కీరవాణి అందిస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నుండి, టీజర్స్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.